నాకు కరోనా వైరస్ అంటించేందుకు కుట్ర చేస్తున్నారు: రఘురామకృష్ణరాజు

  • క్రిస్టియన్ దళితులతో దాడి చేయించాలనుకుంటున్నారు
  • రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది
  • హిందూ మతంపై దాడి జరుగుతోంది
వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కరోనా వైరస్ అంటించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. క్రిస్టియన్ దళితులతో తనపై దాడి చేయించేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఆటవిక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని, హిందువులు మేల్కొని దాడిని ప్రతిఘటించాలని చెప్పారు. రాష్ట్ర పోలీసులకు చట్టంపై అవగాహన లేదని అన్నారు. తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని చెప్పారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని తెలిపారు.



Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News